Saturday, October 10, 2015

ఒక్క అడుగు

                                              ఎన్ని వేల కిలోమీటర్లైన తొలి ఆడుగు తోనే ప్రయాణం మొదులౌతుంది. ఇప్పుడు మన ప్రయాణం మన పక్కనే వున్న ..... పక్కనే వున్న ....  మన భూమి పక్కనే వున్నా బుధగ్రహం వైపు .
                                              మానవ జాతిలో అతి ఉత్తమం అని పిలువబడె వాళు అంటే చాల చాల  గొప్ప  చదువులు  చదువుకున్న వాళు. వారి ప్రయత్నం ఈ భూమ్మీద మనుగడ సాగిస్తున్నమనకి ఇంకొ ఆవకాశం కల్పించడం. మన మనుగడకు ఇంకొ గ్రహంపై అవకాశం వారి ప్రయత్నం. మన పక్కనే వున్నా బుధగ్రహంపై మన  జీవితం సాగించాలని మన నివాసం ఏర్పర్చుకోవాలని మన మనుగడ సాగించాలని. అందుకొసం మన దేశంలోనూ    ఎప్పుడో  తొలి ఆడగు వేసాడు  మన  ఆర్యభట్ట.  ఆదేమొదలు ఈ  భూగ్రహం పై  వున్నా దాదాపుగా అన్ని  దేశాలూ  వారి వారి ప్రయత్నాలు చెస్తున్నారు. అన్నీ వెరసి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఎన్నేఎన్నో ప్రయోగాలు మరెన్నో ఆలోచనలు , ఇంకెన్నో ఐడియాలు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో చర్చలు.
                                         
                                            ఇప్పుడు  ఇక్కడె మనం  ఒక్క అడుగు పక్కకు వేదాం.

                                          అన్ని ఫలించాయి మనిషి భూమిద్దే బతికినట్టు అంగారకుడిపై  బ్రతకవచు అని తెలిసింది అంతే మనిషి ప్రయాణం  మొదలు పెట్టాడు. ఇక్కదికేనండి  పక్క  గ్రహనికే. ఏవరి  ఆలోచనలు  వారివి. ఏవరి తీరులు వారివి. ఎవరి దేశంలో వారి వారి ఏర్పాట్లు వారు  చేసుకున్నారు. అందరికంటే ముందు ఒకరు వెళాలని టైం ఫిక్స్ చేసుకున్నారు. అంతా సిద్దం అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్  అయింది .... 10 .... 9 .......... 8......... 7......... అప్పుడే సరిగ్గా అప్పుడే అంగారకుడిపై వున్నా ఒక రోబర్ట్  ఒక  చిత్రం చిపించింది మన గోప్పవాళ్ళకి. అది చూపిన చిత్రం. ముందు  ఏదో ఒక రాయే అనుకుంది కింద చూసి. ఎక్కడానికి ప్రయత్నించింది కాని కుదరలేదు . ఒక చుట్టు  చుట్టింది  ఏదో అప్పటివరకు చూడనిది వున్నట్టు  అనిపించింది. కాస్త  దూరం  వెళ్ళింది  ఆ  రోబోర్ట్  కొంచం కొంచంగా తల పైకైతింది. ముందు అవి మనిషి పాదాలనిపించింది. ఇంకాస్త దూరం వెళింది రోబో అవును అవి మనిషి  పాదాలే. అంతే ఇక్కడ భూమిద కౌంట్ డౌన్ స్టాప్ అయింది. అంగారకుడిపై ఇంకాస్త దూరం  వెళింది రోబో తన తల పైకెత్తి చూస్తుంది పాదలపైనుంచి కాస్త పైకి కాళ్ళకి కడియాలు ఉన్నాయ్. ఆ పైన కేసరి రంగులో పంచకట్టు ఇంకాస్త పైన నడుముకి వీణ. ఇంకాస్త దూరం వెళ్ళింది రోబో. ఆ వీణ పైన రెండు చేతులు ఒక చేతిలో వీణ ఇంకో చేతిలో తాళాలు, మనికట్టుకి రుద్రాక్షలు పూలు చుట్టి ఉన్నాయ్. ఇంకాస్త దూరం వెళ్ళింది రోబో మెడలో పూలమాల ఇంకాస్త దూరం వెళ్ళింది రోబో నగుమోము, నుదుటి పై నామం, నెత్తిపై ముడివేసిన పిలక. కౌంట్ డౌన్ చేసిన ప్రయాణం ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ అప్పుడ్డే మనిషి మనుగడ సాగిస్తునాడు అని అనుకున్నారు. ప్రయాణం కోసం చేసిన ఏర్పాట్లు ఆపేసారు. కాని ఈ భూమ్మీద భారతీయుడు ఉన్నాడు కందండి ... మనకు తీలిసిపాయింది అక్కడ ఉన్నది ఎవరని. వెనువెంటనే మనం ప్రయాణం మొదులుపెతాటాం. అంగారకుడిపై కాలు పెట్టాం. ఎందుకుంటే అక్కడ వున్నది సర్వలోక సంచారి నారదా.


No comments:

Post a Comment